పిల్లల్ని సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తాం. ఒక్కసారి ఆ ముద్దు పేర్లే అసలు పేర్లను డామినేట్ చేసి జీవితాంతం నిలబడిపోతాయి కూడా. మనందరికీ ఏవో ముద్దు  పేర్లు వుండే ఉంటాయి.అలాగే మనం ఇష్టపడే సెలబ్రెటీస్ కూడా ముద్దు పేర్లున్నాయి. సమంతను ఏమాయచేసావే సిఎంమాలో నటించాక  అందులో హీరోయిన్ పేరుతోనే జెస్సీ అని సామ్ అని పిలుస్తారట ఫ్రెండ్స్. హన్సిక కు తమిళ్ లో చిన్న ఖుష్భు అని పిలుస్తారు. అమలాపాల్ ని ఆమ్స్ ,ఆము , బ్రాట్ అని స్నేహితులంటారు. కాజల్ ని ఇంట్లో అందరూ కాజు అంటే త్రిష నయితే హానీ అంటారు. తమన్నా ని తమ్ము అనేస్తారు. ఇక అనుష్క అసలు పేరే స్వీటీ శెట్టి . తనను స్వీటీ అనే పిలుస్తారు. నయన తార ను కుటుంబ   సభ్యులు  మణీ అని స్నేహితులు నయన్ అని ఇలియానా ను ఇలూ అయింది. శ్రద్ధ దాస్ ని వాళ్ళ బామ్మ  మాకడ్ అంటే కోతి ని ట్రిమ్ చేసి మాకూ  అని పిలుస్తుందిట. సోనమ్ కపూర్ ని వాళ్ళ నాన్న జిరాఫీ అంటారట. ఐశ్వర్య రాయి ని ఇషూ , గోల్లు, ఐస్ అంటారట. కరీనా కపూర్ ని బెబో , ప్రియాంక చోప్రా ని మీమీ అంటారు. ఇంకెన్నో ఎందరో పేర్లు సరదాగా వినబడుతూనే ఉంటాయి.

Leave a comment