ఇవ్వాళ చీర అందం మొత్తం బ్లవుజ్ డిజైన్ పై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ డిజైనర్స్ అది ఎంత అందమైన బ్లవుజ్ అయినా మెడ ఆకృతిని బట్టి డిజైన్ ఎంపిక చేసుకోవాలంటున్నారు. మెడ సన్నగా పొడవుగా ఉంటే రౌండ్ నెక్. మెడ పొట్టిగా, లావుగా ఉంటే డీప్ నెక్, బ్రాడ్ నెక్, ఫాట్ నెక్, బ్యాక్ ఓపన్ డోరీ డిజైన్స్, భుజాలు వెడల్పుగా వుంటే కాలర్, హై, రౌండ్, బోట్ నెక్ ఆకారాల్లో బావుంటాయని సూచిస్తున్నారు. కానీ మనo వెళ్ళే వేడుకను బట్టి కూడా బ్లవుజ్ డిజైన్స్ ఎంపిక చేసుకోవలంటారు. సంగీత్ వంటి వేడుకల కయితే హై నెక్, ఇన్ లైన్ కబ్ బ్లవుజులు బావుంటాయని చెపుతున్నారు. గెట్ టు గెదర్ కార్యక్రమాలకయితే రౌండ్ నెక్ లేదా అధికారిక కార్యక్రమాలు, ఆఫీస్ ప్రోగ్రామ్స్ కు కాలర్ నెక్ లు, ఇక పెళ్ళిళ్ళు, సంప్రదాయ వేడుకలకయితే క్లోజ్డ్ నెక్, రౌండ్ నెక్ ఎంచుకోమంటున్నారు. ఇక లేహంగాల పైకి చైనీస్ కాలర్ నెక్, పాట్లీ బటన్, కీ హాల్ డిజైన్స్ తో అతుకినట్లు కుట్టించుకొంటే ఇక లెహంగా అందమంతా కనిపిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.

Leave a comment