నగల ఫ్యాషన్ లలో కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి.లాకెట్ ఏదైనా అది త్రిడిగా ఉంటే మాకు నచ్చుతాయి అంటారు అమ్మాయిలు.ఇప్పుడిలాగా పూల బుట్టలు, బొకేలు వజ్రాలు, పచ్చలు, నీలాలు,రత్నాలు,ముత్యాలు పొదిగినవి మార్కెట్లోకి వచ్చాయి.ఈ పూల బుట్టలు,బొకేలు నగలు విక్టోరియా  కాలం నాటివి.అప్పట్లో వీటిని లిటిల్ గార్డెన్ డిజైన్స్  అనే వాళ్లట.మొదట్లో బంగారపు పూత పూసిన వెండి తో అందంగా తయారు చేసే వాళ్ళు తరువాత గాజు రాళ్ళు రైన్ స్టోన్ లు పొదిగి పూరేకుల కోసం ఎనామిల్ పూత  వేసే వాళ్ళు ఇప్పుడా నగలను కొరల్ జెడ్ ముత్యాలు,పచ్చలు, నీలాలు పోదిగి అచ్చమైన గులాబీలు, చామంతులు, లిల్లీలు, వంటి పూలను  సృష్టించేశారు డిజైనర్లు. ఈ పూరేకుల సొగసుల నగలు ఇవాళ్టి ట్రెండ్.

Leave a comment