ఊబకాయం మీద జరిగే పరిశోధనలు అన్ని ఇన్ని కావు లండన్ ఇంపీరియల్ కాలేజ్ నిపుణులు పరిశోధనలో ఒక కొత్త విషయం తెలిసింది. మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి అవసరమైన శక్తి కోసం గ్లూకోజ్ కావాలన్నది తెలిసిందే. అయితే హైపో థెలామస్ భాగం నుంచి స్రవించే గ్లూకోసెజ్ అనే ఎంజైమ్ కారణంగా మనకు గ్లూకోజ్‌ తీసుకోవాలన్న కోరిక కలుగుతుంది. ఇది ఎంత ఎక్కువ స్రవిస్తే అంత ఎక్కువ గ్లూకోజ్ ను ఆహారం ద్వారా తీసుకుంటున్నట్ల్లు తక్కువ స్రవిస్తే తక్కువ తిన్నట్లు తేలింది. ఈ ఎంజైమ్ స్రవాన్ని నిరోధించటం ద్వారా ఆకలిని పెంచటం తగ్గించటం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఒక ప్రత్యేక పోషక పదార్ధం కోసం మెదడు స్పందిస్తుందని తేలిన తర్వాత తొలి పరిశోధన ఇదే అంటున్నారు. మెదడు పని తీరు ఆహారం పై ఆదారపడి ఉందని పరిశోధన సారాంశం.

Leave a comment