ఇతర శరీర భాగాలకులాగే మెదడుకి కూడా శిక్షణ ఇవ్వవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. జ్ఞాపక శక్తినీ,ఏకాగ్రతను పెంచేలా మెదడుకు శిక్షణ ఇచ్చే వ్యయామాల్నీ వారు గుర్తించారు.ఇది పూర్తిస్థాయిలో మనుష్యులలో తెలివి తేటలు పెంచకపోయినా చదువుకొనే చోట ,పని చేసే చోట అవసరమైన నైపుణ్యాలను మెరుగు పరుస్తాయని చెపుతున్నారు. ఫోన్ నెంబర్లు .దిక్కులు,ప్రయాణ మార్గాలు గుర్తించుకొనే గ్యూయిల్ ఎన్ బ్యాక్ వ్యాయామం సాధన చేసిన వారిలో జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉందని గుర్తించారు. మారిపోయే స్వీక్వెన్సుల్నీ గుర్తించుకొనే కాంఫ్లిక్స్ స్పాన్ గా పిలిచే వ్యాయామం సాధన చేసిన వారిలో ఫలితాలు ఎంతో బావున్నాయని వారు చెపుతున్నారు.

Leave a comment