చిన్న తనంలో పిల్లలు బోర్డు గేమ్స్ ఎక్కువగా ఆడతారు. మెనోపోలి, క్యాండి ల్యాడ్, స్నేక్స్ ఎండ్ ల్యాడర్ ఇవి అన్ని పాతకాలం నుంచి ఉన్నవే. ఈ ఆటలు పిల్లల్లో నైపుణ్యానికి సానపెడుతున్నాయని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. రంగును గుర్తించటం,లెక్కల గ్రూప్ సహకారం వంటి విలువైన పాఠాలు పిల్లలు చాలా తెలిగ్గా నేర్చుకోవచ్చు. చెస్ , చక్కర్స్, డామినోస్ వంటి ఆటలు పిల్లల్లో గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. నెంబర్ల లెక్కింపుతో కూడిన ఆటలతో పిల్లల్లో లెక్కలను ప్రభావ వంతంగా చేసే నైపుణ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. పిల్లలు ఈ బోర్డ్ గేమ్స్ కనీసం గంటైనా ఆడేలా చూడాలని సలహా ఇస్తున్నారు.

Leave a comment