కోవిడ్ వల్ల గాని ఇతర ఇతరత్రా ఏ ఫ్లూ వంటి జ్వరాలు వల్ల కానీ కొంతమందికి రుచి వాసన పోయి త్వరగా రావటం లేదు. అలాటప్పుడు నువ్వుల నూనె తో వంటకాలు చేసుకొంటే జీర్ణశక్తి పెరగడమే కాక జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అల్లం ముక్క రోజు కొంచెం తింటే క్రమంగా రుచి,వాసన తిరిగి వస్తాయంటున్నారు. వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగితే మంచిది. పుదీనా ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి చల్లారాక తేనె కలిపి తాగితే అందులోని మెంథాల్ కారణంగా రుచి వాసన తెలుస్తాయి అంటున్నారు వైద్యులు.

Leave a comment