Categories
ఒక కప్పు యోగర్ట్ ప్రతిరోజు తీసుకొంటే ఊపిరితిత్తులకు కేన్సర్ వచ్చే అవకాశాలు 20 శాతం తగ్గుతాయి అంటున్నారు పరిశోధకులు . ఈ రోజుల్లో కేన్సర్ ప్రపంచాన్ని వణికించేస్తోంది . కేన్సర్ చివరి దశ వరకు వచ్చేదాకా దాన్ని గుర్తించటం చాలా కష్టం .ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో యోగార్డ్ తో పాటు ఫైబర్ ఉన్నా ఆహారం కూడా తీసుకొంటే కాన్సర్ ముప్పు 33 శాతం తగ్గుతోందని గుర్తించారు. యోగార్డ్ లో లభించే ప్రోబయోటెక్,మంచి బాక్టీరియా కేన్సర్ ను అడ్డుకొంటాయని పరిశోధకులు అంటున్నారు .