తమిళనాడులో ని మధురై లో మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపం హరిస్తుంది.అమ్మవారి భుజం పైన చిలక తో ప్రసన్న వదనంతో భక్తులను ప్రసన్నులను చేస్తుంది.
మీనాక్షి అమ్మవారి తో సుందరేశన్ స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు.అమ్మ సకల పాపాలను తొలగించి మోక్షం ప్రసాదిస్తుంది.ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.హైదరాబాద్ లో కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవం కార్యక్రమానికి మీనాక్షి సహిత సుందరేశన్ స్వామి వారు విచ్చేసి భక్తులకు దర్శనం ఇస్తారు.కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా వుంటుంది.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పొంగలి.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment