ఉరుకులు, పరుగుల పనులతో అమ్మయిలు అలసిపోతారు. ఆ ఎఫెక్ట్ కళ్ళ పైనే తెలుస్తుంది. నీరసంగా అలసటగా ఉండే కళ్ళకు పగటి వేళ క్లాసిక్ ఐ మేకప్ తో మెరుగులు దిద్దమంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. కాజల్ లేదా కోల్ పెన్సిల్ కళ్ళకు చక్కని మెరుపులు ఇస్తుంది. స్మోకీ ఎఫెక్ట్ రావాలంటే కాజల్ అప్లయ్ చేశాక కాటన్ స్వాబ్ లేదా ఇయర్ బడ్ తో కొద్దిగా సరిదిద్దాలి, యాంటీ స్పీడ్ కోల్ పెన్సిల్ బాగా సూటవుతుంది. ఐ నెక్ చక్కగా వాడగలిగితే కాజల్ అక్కర్లేదు. కళ్ళకు మంచి రూపం కోసం ఐ లైనర్ పైకి కలుపుతు అప్లయ్ చేయాలి. సాప్ట్ లుక్ కోసం బ్రౌన్ రకం ఎంచుకుంటే బావుంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment