సబ్బుతో మొహం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది అనుకుంటాం కాని మేకప్ వదలటం చాలా కష్టం. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటే దాన్ని తప్పనిసరిగా నూనె ఆధారిత మేకప్ రిమూవర్ ను వాడి తుడిచేయాలి. అటు తర్వాత నీళ్ళలో కడుక్కుంటే పోతుంది. అలాగే సబ్బులు నేరుగా శరీరం పై రుద్దకూడదు. ముందు చేతుల పై రుద్దుకుని ఆ నురగనే మొహం పై రాసి సున్నితంగా రుద్దితే మృతకణాలు పోతాయి. అలాగే మొహానికి వేసుకునే పీల్ ఆఫ్ మాస్క్ లు వేసుకున్న నేరుగా సబ్బుతో రుద్దుకుంటే ఆ మాస్క్ ప్రభావం కూడా ఉండదు. అప్పుడు కేవలం నీళ్ళతోనే కడుక్కోవాలి. గాఢమైన సబ్బులు వాడకంలో మొహం పై తేమ మాయమై చర్మం పొడిగా అయిపోతుంది.

Leave a comment