మిలిందా గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సతీమణి.27 ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మిలియన్ల కొద్దీ డాలర్లు షేర్లు దక్కాయి.బిల్ గేట్స్ సతీమణిగా అంతులేనంత ఆస్తిని దక్కించుకున్న దాతృత్వం సేవ నిరతి లో ఆమె పెళ్ళికి ముందు నుంచి ధనికురాలే కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ సాధించి ఎం.బి.ఏ ముగించి ఉపాధ్యాయురాలిగా కెరీర్ మొదలు పెట్టిన మెలిండా అంతిమంగా మైక్రో సాఫ్ట్ లో స్థిరపడింది.1994 లో మెలిండా బిల్ గేట్స్ ల వివాహం జరిగింది.పెళ్లి తరువాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నడిపించారు .స్త్రీ పురుషుల మధ్య కొనసాగుతున్న నిర్మాణాత్మక అసమానత్వాన్ని  రూపుమాపటం కోసం 2015 లో పీవోటల్ వెంచర్స్ అనే ఇంక్యుబేషన్ కంపెనీ ప్రారంభించారామె ఈ కంపెనీ ద్వారా ప్రజా సేవ లోకి అడుగుపెట్టాలనుకునే మహిళలకు తోడ్పాటు అందించారు మెలిండా.

Leave a comment