మెల్లీ సోలింగర్ ఉప్పల లక్ష్మణరావు గారి భార్య 1898 లో స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో జన్మించిన మెల్లీ హోం సైన్స్ పట్టభద్రురాలు. రెండేళ్ల మెడిసిన్ చదివారు. భారత స్వతంత్ర ఉద్యమం పట్ల ఆమెకు సహానుభూతి ఉంది. 1929లో ఇండియా వచ్చి సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం కృషి చేశారు. మహాత్ముని సబర్మతి ఆశ్రమంలో కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి పనిచేశారు. జీవితాంతం ఖద్దరు ధరించారు  1940లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు జైలు శిక్ష అనుభవించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు భారతదేశానికి స్వతంత్రం రావటం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ చూశాకనే లక్ష్మణరావు దంపతులు మాస్కో వెళ్లి స్థిరపడ్డారు.

Leave a comment