చర్మం ఎండకి కమిలిపోవడం మొటిమలు రావడం ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు చందన గంధంతో ఈ సమస్యను అదుపులో ఉండ వచ్చు.చందనంలో కాస్త గులాబీ నీరు కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే ముఖానికి చల్లదనం అందుతుంది. నలుపు కూడా తగ్గుతుంది. పొడి, జిడ్డు చర్మ తత్వం వుంటే పెరుగు, చందనం పొడి కలిపి ముఖానికి పూతలా వేస్తె ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. జిడ్డు, పొడి చర్మం తేమగా, తేటగా కనిపిస్తుంది. ముల్తానీ మట్టి, అరటి పండు గుజ్జు, చందనం కలిపిన ఫేస్ ప్యాక్ ఎంతో మేలైనది. సహజ సిద్దమైన ఫేస్ ప్యాక్. దీని వల్ల మొటిమలు రాకుండా వుంటుంది. ఎండకు కమిలిన చర్మం పూర్వపు రంగును పొందుతుంది. చమట కాయలు ఇబ్బంది పెట్టినా చందనపు పుతే మంచి మందు.

Leave a comment