పాలిచ్చే తల్లులకు మెంతులు మేలు చేస్తాయని అంటున్నారు ఎక్సపర్ట్స్. మెంతుల్లో ఉండే డయాస్జోనిక్ చనుబాల ఉత్పత్తి అయ్యే మామరీ గ్రంథుల లోని కణజాలం పెరుగుదలకు తోడ్పడుతుంది. బెల్లం, శొంఠి, డ్రైఫ్రూట్స్, నెయ్యి జోడించిన మెంతుల లడ్డులను పాలిచ్చే తల్లులు తినవచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో మెంతి పొడి, పసుపు, శొంఠి, బెల్లం ఇతర మూలికలు కలిపి ఉడికించి హల్వా ఉండలాగా చేసి పరగడుపున తినిపించటం ఆనవాయితీ. ఈ తియ్యని ఉండలతో బరువు పెరుగుతారని భయం ఉంటే మెంతులను రాత్రంతా నీళ్ళలో నాననిచ్చి పరగడుపున తీసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా మెంతుల పొడి నీళ్లలో కలిపి తీసుకోవచ్చు.

Leave a comment