కొన్ని రకాల నూనెలు వాటికి ఉండే సహాజమైన సువాసనతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. శరీరానికి మనుసుకి మేలు చేస్తాయి. ఉదాహరణకు లావెండర్ నూనె నిద్రలేమి సమస్యకు మంచి ఉపశమనం. దింపులపైన ఈ నూనె రెండు చుక్కలు చల్లినా చాలు హాయిగా నిద్రపడుతోంది సువాసనతో. చర్మవ్యాధులు తగ్గిస్తుంది. దురదలు ఇతర చర్మ సంబంధమైన సమస్యలకు ఈ లావెండర్ నూనె కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి శరీరానికి మర్ధన చేస్తే తగ్గిపోతాయి. అలాగే నిమ్మగడ్డి నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ ,యాంటీపంగల్ గుణాఉ గాయాలు ,పుండ్లను తగ్గిస్తాయి. నిమ్మగడ్డి నూనె వాసనతో రక్తప్రసరణ మెరుగవుతుంది. మెడదు కణాలు ఉత్తేజితం అవుతాయి. ఏకగ్రత పెరుగుతోంది. ఇంటిని శుభ్రం చేసే నీళ్ళలో ఈనూనె చుక్కులు వేస్తే దోము ఈగలు రావు.

Leave a comment