కొన్ని రకాల కూరలు మసాలాలు ఎక్కువగా వేస్తేనే రుచిగా ఉంటాయి. అందుకే అవి పంచ రత్నాల పొడితోనే చేస్తారు. అంటే స్టార్ అనీస్ ,సోంపు గింజలు ,మిరియాలు,దాల్చిన చెక్క,లవంగాలు కలిపి చేసే పొడినే పంచ రత్నాల పొడి అంటారు. ఇవి కూరలకు లేదా ఆహార పదార్థాలకు ఘాటు,నోరు ఊరించే వాసనలు ఇస్తాయి. ఇవి పూర్తిగా ఫిలో కెమికల్స్ తో నిండి ఉంటాయి. గరం మసాలాల్లో యాలకులు ,మిరియాలు,దాల్చిన చెక్క, లవంగాలు కలిపి ఉంటాయి. చాట్ మసాలాలో ధనియాలు , నల్ల మిరియాలు,జీలకర్ర మామిడి పొడి ఉంటాయి. పంజాబీ గరం మసాలలో సొంపు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా ,మిరియలు ధనియాలు వేస్తారు. కొన్ని మసాల పొడులతో క్యాన్సర్ ,గుండె జబ్బులు ,డయాబెటిస్ ,బిపి లతో పోరాడుతాయి.

Leave a comment