ఏం కావాలి అని అడిగాడు గుజరాత్ కు చెందిన ఉపాధ్యాయుడు హర్ దేవ్ సింగ్ ఆయన కూతుర్ని. వాళ్ళ అమ్మాయి కిన్నారి బా కు వడోదర కు చెందిన పూర్వ సింగ్ తో పెండ్లి కుదిరింది. అతను కెనడాలో స్థిరపడ్డారు అత్తారింటికి నీతో పాటు ఏం తీసుకుపోతావు,నీకేం కావాలి అని అని ముద్దుగా అడిగాడు తండ్రి. ఆ అమ్మాయికి పుస్తకాలంటే తగని అభిమానం నా ఎత్తు  పుస్తకాలు నాకు కానుకగా ఇమ్మంది ఆ కూతురు,ఆరు నెలల పాటు ఢిల్లీ వారణాసి,బెంగళూరు తో పాటు ప్రముఖ పట్టణాలన్నీ గాలించి గాలించి ఖురాన్,బైబిల్,అష్టాదశ పురాణాలతో సహా నిలువెత్తు బుక్స్ కొని కూతురికి పెళ్ళి కానుక ఇచ్చి పంపించాడు తండ్రి. 2200 పుస్తకాలతో ఆమె ఎత్తు ప్యాకెట్లు తయారుచేయించాను అన్నాడాయన గర్వంగా.

Leave a comment