కొన్నేళ్ళుగా జిమ్ ట్రైనర్స్ పులప్స్ చేయమని చెప్తున్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని ఫిట్ నెస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ తీసుకున్నకా ఇక తప్పలేదు. ఇప్పుడు ప్రయత్నం చేశా. నా దృష్టిలో ఫిట్ నెస్ అంటే అందం కోసం కానే కాదు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం బలం అంటుంది సమంత. మనం ఫిట్ గా ఉంటే ఇండియా ఫిట్ గా ఉంటుందంటూ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాధోడ్ హమ్‌ ఫిట్ తో ఇండియా ఫిట్ హై పేరుతో ఫిట్ నెస్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు. జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఈ చాలెంజ్. సహనటులు రకుల్, మంచు లక్ష్మి, లావణ్య త్రిపాఠి, దీపిక పదుకునే, అనుష్క శర్మ వంటి వాళ్ళు చాలెంజ్ తీసుకున్నారు.

Leave a comment