వారానికి ఒక సారి తీరికగా శరీరానికి నలుగు పెట్టుకోని స్నానం చేస్తే ఒంటికి రక్తప్రసరణ జరిగి మేని మెరిసిపోతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. పాలు, పెసర పిండి, శెనగపిండి,వట్టి వేళ్ళ పొడి,పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, చందనం, గులాబీ రేకుల పొడి ఇవన్నీ స్టోర్స్ లో దొరుకుతాయి.ఒక్క అర స్పూను చొప్పున ఇవన్నీ తీసుకొని నువ్వుల నూనె కలిపి ఆ పేస్ట్ తో నలుగు పెట్టుకోవాలి.అలాగే జుట్టుకు మెంతికూర మెత్తని గుజ్జు గా చేసి పెరుగు కొబ్బరి పాలు కలిపి తలకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు శరీరం ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment