నెలసరి పద్దతిలో రాకపోవటం,అప్పుడూ కలిగే చిరాకు,పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలకు ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఆ సమస్యలు అదుపు లోకి వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . హార్మొన్లను క్రమబద్దం చేసే గుణం నువ్వుల్లో ఉంది . నువ్వులు వేయించి అందులో బెల్లం కలిపి దంచి ముద్దచేసి ప్రతిరోజూ తినాలి . ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది . బొప్పాయి ముక్కల్లో పీచు ,విటమిన్ -ఎ ఉంటుంది . శరీరానికి పోషకాలు అందుతాయి . మరిగే నీళ్ళలో చక్కర వేసి ఆ నీళ్ళు భోజనం తర్వాత తీసుకోవాలి . చిటికెడు దాల్చిన చెక్కపొడి పాలల్లో కలిపి ప్రతిరోజు తాగాలి . నెలసరి క్రమం తప్పకుండా రవళి అనుకొంటే వ్యాయామం కూడా చాలా అవసరం .

Leave a comment