మనసులో వత్తిడి ని ఎప్పటికప్పుడు బయటికి పంపేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి . జీవన శైలిలో కొన్ని మార్పుల ద్వారా దాన్ని సాధించవచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఉదయం వేళ కుదరని పక్షంలో సాయంత్రమైన సరే కాస్త నడక ,డాన్స్ . వ్యాయామం ఏదోఒకటి చేసి తీరాలి . జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటే జీర్ణవ్యవస్థ లో వ్యర్దాలు చేరుకోకుండా ఉంటాయి . ఇంట్లో శుభ్రత మెయిన్ టెయిన్ చేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది . పదినిముషాల పాటు ధ్యానం చేస్తే శరీరంలో అన్ని భాగాలకు ప్రాణవాయువు వారధిగా అవుతుంది . పదిహేను రోజులకు ఒకసారి ఘనాహారం మానేసి కేవలం పండ్ల రసాలు ,పచ్చికూరలు పండ్లు తీసుకొంటే శరీర వ్యవస్థ శుభ్ర పడుతుంది . మాససిక ఒత్తిడి ని ఇవన్నీ తగ్గించే మార్గాలు .

Leave a comment