ఎఫ్ బిబి కలర్ ఫెమీనా మిస్ ఇండియా 2018 కి రకుల్ ప్రీత్ సింగ్ మెంటర్ గా వ్యవహరించనుంది. ఈ విషయం గురించి చెబుతూ నేను ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టానో మళ్లీ ఇక్కడికే చేరాను. 2011లో మిస్ ఇండియాలో పోటీదారుగా ఉన్నాను, ఇప్పుడు మళ్లీ మెంటర్ గా వస్తున్నా అంది. ఆ వయసులో నాకు ఆ వేదిక చాలా బాగా ఉపయోగపడింది. సినిమాల్లోకి వచ్చాను ఎంతో మందితో పరిచయం అయింది. అప్పటి నూమ్చి జీవితం చాలా గొప్పగా నడిచింది. మిస్ ఇండియా పునాది వేదిక లాంటిది. ఇప్పుడు పోటీదారులను అందరిని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరి నుంచి ఉత్తమమైంది ఏదో దాన్ని బయటకు తీసుకు వస్తాను. నిజానికి నేను నాటైమ్ లో విజేతను కాను అయినా ఇంత దూరం వచ్చాను కదా, నేను నా జీవితం గురించి చెప్పి అందరిని ప్రోత్సహిస్తానంటుంది రకుల్ ప్రీత్ సింగ్.

Leave a comment