మెంతుల్లో అధిక మోతాదులో ప్రోటీన్,నికోటిసిన్ లెసిథిన్ పొటాషియం లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడేవి. నాన పెట్టిన మెంతి పిండిలో కొబ్బరి పాలు కలిపి తలకు ప్యాక్ వేసుకొంటే జుట్టు మెత్తగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ జుట్టు చక్కగా ఎదిగేందుకు సాయం చేస్తుంది. పావు కప్పు మెంతులు నానపెట్టి మెత్తగా రుబ్బి దానికి పాలపొడి,పెరుగు కలిపి పేస్ట్ లా చేసి మొహానికి ప్యాక్ వేసుకోవాలి అరగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం పై ఉండే మచ్చలు పోతాయి. నాన బెట్టిన మెంతి పిండిలో తేనె,పంచదార కలిపి మెడ,ముఖం,మెచేతులపైన రాసి అవసవ్య దిశల్లోమెత్తగా రుద్దితే మృతకణాలు పోతాయి మొహం
మెరుపుతో ఉంటుంది. ఛాయ మెరుగవుతోంది.

Leave a comment