Categories
Soyagam

మెరిపించే చాయ కోసం ఫేస్ పాక్

ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ లో ఎలాంటి రసాయినాలు కలవవు కనుక మొహానికి ఎలాంటి హనీ జరగదు. అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వువు కనుక కొన్ని ఫేస్ ప్యాక్స్ ట్రయ్ చేయొచ్చు.  ఇది మార్కెట్ లో దొరికే క్రీములన్నింటి కంటే బాగా పని చేస్తుంది. ఎండకు కమిలిన చర్మం సరైన రంగులోకి వస్తుంది. ఇందుకు కావలసినవి మెంతులు, కలబంద గుజ్జు, అరటి పండు గుజ్జు. ఈ ఫేస్ ప్యాక్ రోజు వేసుకోవచ్చు. మొటిమలు, మచ్చలు కూడా పోతాయి. ముందుగా రెండ టేబుల్ స్పూన్స్ మెంతులు నాలుగైదు గంటలు నాననివ్వాలి. కలబంద గుజ్జు మూడు స్పూన్లు, అరటి పండు గుజ్జు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నానా బెట్టిన మెంతులని మిక్సి లో వేసి మెత్తగా అయ్యాక ఈ రెండు గుజ్జులను మెంతి గుజ్జు తో కలిపి మళ్ళి మిక్సి వేసి బౌల్ లోకి తీసుకోవాలి. ముఖం చల్లని నీళ్ళతో కడుక్కుని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేసి చుస్తే మార్పు కనిపిస్తుంది. వీలైతే ప్రతి రోజు, లేదా వారానికి రెండు మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.

Leave a comment