చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఎన్నో పదార్థాలు వంటింట్లోనే ఉన్నాయి.బంగాళాదుంప లతో చర్మం పైన నల్ల మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది.ఒక గిన్నెలో టీ స్పూన్ యోగర్ట్,ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మ గడ్డి నూనె లేదా, శాండల్ వుడ్ నూనె తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమంలో మధ్యకు కోసిన బంగాళాదుంపను మంచి దానితో మొహం పైన నెమ్మదిగా రాస్తే వెంటనే ప్రయోజనం కనిపిస్తుంది. ముఖంపైన మురికి,మలినాలను వదిలించుకునేందుకు బియ్యంపిండి వాడవచ్చు. టీ స్పూన్ చొప్పున అలోవెరా జెల్ బియ్యం పిండి, ఉప్పు, లావెండర్ నూనె తీసుకొని ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి మర్దనా చేసినట్లు రాసుకోవాలి. ఆరిపోయిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

Leave a comment