బ్యూటీ ఎక్సపర్ట్ ఎంతో శ్రద్ద తీసుకొని మరీ చెప్పిన ట్రిక్స్ అనిపిస్తుంది వీటిని చూస్తుంటే . నలబైలు తరువాత ఎలాగైనా చర్మం నాజుకుతనం పోగొట్టుకోవడం మొదలవుతుంది. ముందు మంచి నీళ్లు ఎక్కువగా తాగడం మొదలు పెడితే చర్మం పాడువదు.మాన్నికైన మోత్సరైజర్ వాడాలి.మస్కారా తో పాటు కాటుక లేదా జెల్ లైనర్ వాడితే కళ్లకు స్టార్ లుక్ వస్తుంది. పెదవులకు లిప్ లైనర్, లిప్ గ్లాస్ తప్పనిసరిగా అప్లై చెయ్యాలి. లిప్ స్టిక్ కలర్ స్కిన్ టోన్ ను బట్టి వాడాలి లవెండర్ , తైమ్ మూలికల్లో చర్మాన్ని రక్షించే సమర్ధ్యాలున్నాయి. చర్మం మెరిసేలా చేసేందుకు లవెండర్ ఆయిల్ ను నేరుగా కానీ ఇతర పదార్దాలతో జోడించి కానీ వ్రాసుకోవచ్చు. లవెండర్, కొబ్బరినూనె స్టార్చ్ తో క్రీమ్ తయారు చేసి ఉపయోగించుకొంటే మృతకణాలు పోయి చర్మం చక్కగా మెరుస్తూ ఉంటుంది.

Leave a comment