రుచిగా ఉండేవి తింటుంటే కరకరమని శబ్దం వచ్చేవి. నోట్లో వేసుకుంటే జున్నులాగా కరిగిపోయేవి ఎన్నో పదార్ధాలు తిని ఉంటాం. ఇప్పుడు గ్లో ఇన్ ది డార్క్ ఫుడ్స్ వచ్చాయి. చిరు చికట్లో ఏ బర్గరో,కేకో ,కూల్ డ్రింక్ జిగేల్ మని మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఈ వెలిగే తిండిని నోట్లో పెట్టుకోవడం సరదానే కదా. నూడిల్స్,పాస్తా, డిజార్ట్‌ లు క్యాండీల్లో వాటిని మెరిసేలా చేసేందుకు టానిక్‌ వాటర్ ను గాని విటమిన్ బీ 12 గాని ,జెల్ ఫిష్ నుంచి తీసిన మెరిసే పదార్ధాలు కాని కలుపుతారు. పదార్ధాల తయారిని బట్టి ఎంత కలపాలో వంటల కోర్సులు చేసిన కొత్త తరం చెఫ్ లు చూసుకుంటారు. గో ఇన్‌ ది డార్క్ ఫుడ్ ఇప్పుడు పుట్టిన రోజులు, ముఖ్యమైన అకేషన్లలో నోరూరిస్తున్నాయి.

Leave a comment