Categories
Soyagam

మెరిసే కురుల కోసం ఆలివ్ నూనె

జుట్టు పొడిబారిపోకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ తో జుట్టును అందంగా వుంచుకోవలనుకొంటే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్ళలో తీసుకొని తలస్నానానికి అరగంట ముందుగా పట్టించి అనంతరం స్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ లో వెల్లుల్లి పొట్టు వేసి కాచి చల్లార్చి జుట్టుకు అప్లై చేస్తే నెరవకుండా జుట్టు బాగా పెరుగుతుంది. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, కొన్ని కీరా దోస ముక్కలు, గుడ్డు సొన అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా చేసి జుట్టుకు పట్టించి ఓ అరగంట పోయాక స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్, బాదం నూనె కాంబినేషన్ మంచిదే. నాలుగు చుక్కల అల్లం రసం ఆలివ్ ఆయిల్ తో కలిపి జుట్టు కుదుళ్ళ దాకా పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, కొబ్బరినూనె సమపాళ్ళలో తీసుకొని జుట్టు లోపలి వరకు మర్ధనా చేసి, వేడి నీటితో తడిపిన టవల్ తల చుట్టూ చుట్టుకొని ఆ వేడి ఆవిరి తలకు పట్టేలా చేయాలి. తర్వాత స్నానం చేసేయవచ్చు. ఇది కూడా మంచి ఫలితం ఇచ్చేదే.

Leave a comment