మట్టి గాజుకు దారాన్ని చుట్టి ముచ్చటగా చేస్తే అది కాస్తా అప్ డేట్ అయి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీగా ఎన్నో డిజైన్లతో అమ్మాయిల మనస్సు దోచేస్తుంది. ఈ గాజులు దాదాపు అల్లిక నగల్లో జుంకాలు, దుద్దులు కలగలిసిన సెట్లు, ఫ్యాషన్ దుస్తుల పైకి సరిపోయేవి కూడా వస్తున్నాయి. రాళ్ళు, కుందన్లు, చిన్న చిన్న రాళ్ళ బిళ్ళలు, లేసులు, పూసలతో ఇష్టమైన డ్రెస్ మాచింగ్ గా వస్తున్నాయి. డ్రెస్ మాచింగ్ గా బాంద్ బాలీ, హాంగింగ్ బుట్టలు, గొలుసు లాకెట్లు , ఫంకీ జ్యూవెలరీ గానూ ఎన్నో రకాల సెట్లున్నాయి. డిజైనింగ్ చేయించుకున్న డ్రెస్ ను ఫోటో తీసి పంపితే అచ్చం వాటికి మాచింగ్ గా గాజులు, నగలు, వేలాడే జుంకాలు సెట్ చేసి ఇస్తారు. ఈ సిల్క్ థ్రెడ్ జ్యూవెలరీ సెట్స్ ఇమగెస్ చుస్తే అవెంత అందంగా వున్నాయో తెలుస్తుంది.

Leave a comment