వయసు పెరిగే కొద్దీ మోహంపైన మెడ పైన ముడతలోస్తాయి మెడ చుట్టు నలుపు పెరుగుతోంది. కొన్నీ ఫ్యాక్స్ రెండు రోజుల కొకసారి వేసుకోంటే ఈ నలుపు పోతుంది.తెల్ల సొనలో రెండు స్పూన్ల తేనే కలిపి ఈ ఫ్యాక్ ముఖం మెడకు పూతగా వేసుకొంటే మొహాం మెరిసిపోతుంది. మెడ నలుపు తగ్గుతోంది. ఓట్ మీల్ ను ఉడికించి ఆ పేస్ట్ లో గుడ్డుసొన ,నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవచ్చు . శనగపిండి ,పెరుగు కలిపి ఫ్యాక్ వేసుకొన్న మంచిదే. అరటి పండు బొప్పాయి గుజ్జులో తెల్లసొన కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొంటే మొహం ,మెడ తాజాగా కనిపిస్తుంది. చర్మం బిగుతుగా ఉంటుంది. వారానికి ఒక సారి తేనే ,చక్కర ల మిశ్రమంతో ముఖం మెడ మర్ధన చేస్తే మృత కణాలు పోతాయి.

Leave a comment