నల్ల ఉప్పు సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడుతుంది. నల్ల ఉప్పు, వంటసోడా, ఆలివ్ నూనె సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి మెడ, కాళ్లు, మోకాళ్లు మో చిప్పలు మృదువుగా రుద్దుకొని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇంటిపనితో గోళ్ల రంగు మారుతుంటాయి నీటిలో రెండు స్పూన్ల నల్ల ఉప్పు వేసి గోళ్ళను అందులో ఉంచి మృదువుగా రుద్ది కడిగితే గోళ్లు గులాబీ రంగు లోకి వచ్చేస్తాయి. పొటాషియం పుష్కలంగా ఉండే నల్ల ఉప్పు తీసుకుంటే గర్భిణీలకు కండరాలు పట్టేయడం తగ్గుతుంది. ఈ ఉప్పు లో సహజ లవణాలు ఆరోగ్యాన్నిస్తాయి. శరీరానికి నల్ల ఉప్పు తో స్క్రబ్బింగ్ చేస్తే నలుపు పోయి మెరుపు వస్తుంది.

Leave a comment