ఏ నగలైనా పాడవకుండా మెరుపు తగ్గకుండా చూసుకొంటేనే ,నగ మెరుపు విలువ తగ్గకుండా ఉంటుంది అలంకరణలో చివరిగానే ధరించాలి ,తీసేప్పుడు మాత్రం మొదట్లోనే తీయాలి . చమట ,చర్మం పైన ఉండే సహజ సిద్దమైన నూనెలు నగల మెరుపును పోగొడతాయి . నగలు క్రమం తప్పకుండా క్లిన్ చేయాలి . ఒకవంతు మైల్డ్ క్లినర్ కు రెండువంతుల నీళ్ళ కలిపి దానిలో మెత్తని టూత్ బ్రష్ ముంచి నగలు నెమ్మదిగా సున్నితంగా రుద్దాలి . నూరగొచ్చేలా వద్దు క్లిన్ చేసేప్పుడు రాళ్ళూ వదులయ్యాయ ,రాళ్ళను పట్టి ఉంచే బిళ్ళలు విరిగి పోయాయా గమనించుకొని సరిచేయించు కోవాలి చల్లని వాతావరణంలో ఉంగరాలు పెట్టుకోవద్దు . వేళ్ళు కుంచించుకొని ఉంగరాలు వదులై జారిపోతాయి .

Leave a comment