ఈ పండ్ల మాస్క్ తో చర్మం అందులేనంత అందంగా తాజాగా ఉంటుందంటున్నారు ఎక్స్ పర్డ్స్ అరటి పండ్లు తేనె ద్రాక్ష గింజల నూనె కలసిన గుజ్జుతో మొహానికి మాస్క్ వేసుకుంటే చర్మంలో జిడ్డు పోతుంది . అలాగే గుమ్మడి కాయ ముక్కల గుజ్జు ,యాపిల్ సిడార్ వెనిగర్ ,తేనె ,పెరుగు కలసిన ముద్దను మొహం ,మెడ కు మాస్కుల వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే ఈ గుమ్మడి కాయలు ఉండే రెటినాయిక్ యాసిడ్ ,యాంటీ ఆక్సిడెంట్లు బీటాకెరోటిన్ చర్మాన్ని తాజాగా చేసేస్తాయి . బొప్పాయి ,తేనె ,నిమ్మరసం ,గంధం పొడి కూడా ఇంతే ఫలితం ఇస్తాయి . రసాయనాలు కలసిన సౌందర్య లేపనాల కన్నా ఈ సహజమైన పండ్ల మాస్క్ లు చర్మాన్ని చక్కగా మెరుపుతో ఉంచుతాయి .

Leave a comment