ఏరోబిక్ ఎక్సర్ సైజుల వల్ల కలిగే అన్నీరకాల లాభాలు మెట్లు ఎక్కడం వల్ల కూడా కలుగుతాయి . కండరాలు బలపడతాయి. కీళ్ళ ఇబ్బందులు తగ్గిపోతాయి. సాధారణంగా ఇక ఎండలొస్తుంటే గ్రౌండ్ వరకు నడిచి వెళ్ళడం లేదా ఒక్కొసారి వాకింగ్ చేయాలనిపిస్తే చిరాగ్గా ఉంటుంది.ఇక అప్పుడు మెట్లు ఎక్కి దిగే ఎక్సర్ సైజ్ లు మొదలు పెట్టండి హైబీపీ కూడా పనిలో పనిగా తగ్గిపోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మహిళలు మోనోపాజ్ వయసుకు వచ్చే ముందరే మెట్లు ఎక్కిదిగటం ప్రారంభిస్తే ఆ తర్వాత ఎదురవబోయే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. మెనోపాజ్లోతో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. వీటివల్లే రక్త నాళాల ఇబ్బందులు,కండరాల సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలకు విరుగుడు మెట్లేక్కడమే.

Leave a comment