మెట్లు ఎక్కడం వల్ల నడక కంటే రెండింతలు క్యాలరీలు ఖర్చుయపోతాయి .కాళ్ళలో విభిన్న కండరాలకు పనిచెపినట్లే అవుతుంది . తొడలు,కాలిమడమల్లో కండరాలకు వ్యాయామం ఉంటుంది . మెట్లెక్కుతూ పక్కనే ఉన్నా రెయిల్స్ పైన చేతుల్ని నొక్కుతూ పోతే ముంజేతులు భుజాల్లోని కండరాలకు కూడా ఎక్సరసైజ్ లభిస్తుంది . ఇలా చేయటం వల్ల కండరాల కు బలం వస్తుంది . గుండె ఊపిరి తిత్తులు బలోపేతం అవుతాయి . అయితే మోకాళ్ళు ,మడమలు,పాదాల్లో నొప్పులుంటే ఈ మెట్లెక్కటం వద్దు . డాక్టర్ సలహాని మెట్లక్కటం మొదలు పెట్టాలి మొదటి రోజే చాలా మెట్లు ఎక్కకూడదు . ప్రతి రోజు పది నిముషాల చొప్పున కేటాయించు కోవాలి ఒక్కసారి పదినిముషాల వంతున,రోజుకు మూడుసార్లు మెట్లెక్కితే మంచిది పెద్దవాళ్ళు వారానికి 150 నిముషాల వర్కవుట్స్ చేయాలి .

Leave a comment