సిమెంట్ తూముల్లో కట్టేందుకు వీలుగా నిరుపేద నివాసాలుగా ‘ఓ పాడ్’ డిజైన్ ఇంటిని రూపొందించింది 23 సంవత్సరాల పేరాల మానసా రెడ్డి. రెండువేల మిల్లీమీటర్లు వ్యాసం కలిగిన కాంక్రీట్ పైప్ లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ పాడ్స్, లేదా మైక్రో ఇల్లు నిర్మించి చూపెట్టింది మానస కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మానస లల్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది. ఈ ఓ పాడ్ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ, ఇటు కదప గల ఈ ఇల్లు వందేళ్లు మన్న తాయని చెబుతోంది మానస.