ప్రతి ఇంట్లోనూ సాధారణంగా ప్రతి రోజు కూరలు అన్నం మిగిలిపోతూనే ఉంటాయి. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి తిరిగి తినే వాళ్లూ ఉన్నారు కూరగాయలు ఆకుకూరలతో వండిన వంటకాలు మిగిలితే మరుసటి రోజు వేడి చేసుకుని చక్కగా తినొచ్చు కాకపోతే ఆ కూరని ఫ్రిడ్జ్ లో వుంచేప్పుడు గాలి చొరబడని కంటైనర్ లో దాచాలి.ఉల్లిపాయ వేసిన కూరలు పాడవుతాయి. నీళ్లు లేకుండా వేయించిన వేపుళ్ళు మరుసటి రోజు వేడిచేసి తినొచ్చు. బ్రెడ్ వారంరోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచుకొని తినొచ్చు వండిన అన్నం త్వరగా పాడైపోతుంది కనుక దాన్ని ఫ్రిజ్ లో పెట్టి తిన్న కూడా అనారోగ్యమే కనుక అన్నం మటుకు మిగిలితే దాచి తినద్దు.

Leave a comment