పాలు పాల ఉత్పత్తులైన పెరుగు,పన్నీర్ ,చీజ్ నుంచి కాల్షియం ,ప్రోటీన్లు అలాగే వెన్న తీయని పాల నుంచి అధిక మొత్తంలో  కొవ్వు శక్తి లభిస్థాయి . ఎదిగే వయసులో పిల్లల కు ఈ పోషకాలు అత్యవసరం.  పాలలోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తప్పనిసరి . సంవత్సరం లోపు పిల్లలకు తల్లిపాలు లేదా వైద్యుడు సూచించిన ఫార్ములా  పాలు ఇవ్వాలి . రెండేళ్ళు దాటినా పిల్లలకు రోజుకు రెండు ,మూడు గ్లాసుల పాలు ఇవ్వవచ్చు . పాలలోని పోషకాలు పెరుగుతో కూడా వస్తాయి కనుక 18 ఏళ్ళు దాటిన వాళ్ళు పాలు,లేదా పెరుగు ,మజ్జిగ తీసుకోవాలి . టీనేజ్ దాటిన తర్వాత వెన్న తీసిన పాలు ,పాల ఉత్పత్తులు తీసుకొంటే అందులోని అధిక క్యేలరీలకు దూరంగా ఉండవచ్చు . మోనోపాజ్ కు దగ్గరగా ఉండే మహిళలు కాల్షియం అవసరం ఎక్కువ గనుక మూడు గ్లాసుల పాలు లేదా పెరుగు చాలా అవసరం .

Leave a comment