కాల్షియం పుష్కలంగా ఉండే పాలు చక్కని ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగ పడతాయి . అరకప్పు కాచి చల్లార్చిన పాలలో దూదిని తడిపి ఆ పాలను మొహానికి పట్టించి ఓ అరగంట ఆలా వదిలేయాలి . బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే మొహం మృదువుగా తాజాగా ఉంటుంది . చర్మాన్ని ప్రకాశవంతంగా మర్చెందుకు కూడా గృహవైద్యం పనిచేస్తుంది . తేనె ,పసుపు ,చందనం కలపి మొహానికి పట్టించినా వాటిలోని యాంటిబ్యాక్టీరియల్ గుణాల కారణంగా చర్మం తాజాగా అవుతుంది . పాలు తేనె మిశ్రమం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది తేనె చర్మాన్ని పట్టులాగా మృదువుగా మార్చేస్తుంది . చల్లని పాలలో మెత్తని గుడ్డను తడిపి దాన్ని మొహంపై కప్పుకొని ఇరవై నిముషాల తరువాత కడిగేస్తే మొహం మెరుస్తూ కనిపిస్తుంది .

Leave a comment