ఇవ్వాల్టి రోజుల్లో పెరుగు ఎప్పుడంటే అప్పుడు దొరకటం కష్టమే ఎలాటి సమయంలో పాలపొడి తెచ్చి ఇంట్లో ఉంచు కుంటే రుచికరమైన పెరుగు తయారు చేసుకోవచ్చు .ఒక గిన్నెలో నీళ్ళు పోసి పాలపొడి వేసి బ్లెండర్ తో చక్కగా మిక్స్ చేయాలి .ఆ పాలని చిన్న మంట పై వేడిచేయాలి .పాలు బాగా మరిగిన తరువాత చలార్చి ఓ స్పూన్ పెరుగు వేసి మూతపెడితే నాలుగైదు గంటల్లో రుచికరమైన పెరుగు తయారవుతుంది .దీన్ని రైతా , డిజర్ట్ లుగా కూడా ఉపయోగించు కోవచ్చు .ఇది చాలా రుచిగా ఉండే మీగడ లేని కొవ్వు లేని పెరుగు .లాక్ డౌన్ సమయంలో అవసరానికి ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది .

Leave a comment