పాలపొడి చర్మానికి, జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.పాల పొడిలో విటమిన్లు మినరల్స్ అధిక మొత్తంలో ఉంటాయి.ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా తాజాగా మారుస్తుంది.రెండు టీ స్పూన్ల బియ్యం పిండి అంతే పరిమాణంలో టీ డికాషన్ ఓ టేబుల్ స్పూన్ పాల పొడి తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కుంటే మృతకణాలు పోయి మృదువైన చర్మం సొంతం అవుతుంది.రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి స్పూన్ పెరుగు టేబుల్ స్పూన్ చొప్పున వెనిగర్ తేనెను కలిపి మొహానికి పూతల వేస్తే ముఖం పై ఉన్న నల్లని మచ్చలు పోతాయి.చర్మం తాజాగా ఉంటుంది.

Leave a comment