తవ్వకాల్లో ఎక్కడో పురాతన వస్తువులు బయటపడ్డాయని వింటూ ఉంటారు. ఇజ్రాయిల్ లో జరిగిన ఒక గని తవ్వకంలో లక్షల ఏళ్ల నాటి గుహ బయట పడింది అది మామూలు గుహ కాదు.స్పటిక గుహ. 1968 లో వెలుగు చూసిందీ గుహ ..దీని పేరు సోరెక్.ఈ గుహ బయటపడ్డాక దాన్ని ఎంతోకాలం రహస్యంగా ఉంచారు 1975 నుంచి సందర్శకులను గుహలోకి అనుమతించారు. గుహలో అనేక ప్రకృతి దృశ్యాలు సహజంగా ఏర్పడ్డాయి.గుహ పై కప్పు నుంచి చుక్కలుగా పడుతున్న నీళ్లు సంవత్సరాల తరబడి జారుతూ ఆ నీటిలో కరిగి ఉన్న సున్నపురాయి గుహలో ఎన్నో రకాల రూపాలు పొందింది.ఈ గుహలో ఎప్పుడూ 22 డిగ్రీల చల్లదనం తేమ ఉంటుంది.

Leave a comment