ఇంట్లో ఉండే గృహిణికి ఎడతెరపి లేని పని ఉంటూనే ఉంటుంది. ఐతే రోజు మొత్తం అన్ని పనులు చేసిన 45 నిమిషాల మైండ్ హాలిడే ఇవ్వండి అంటారు ఎక్స్ పర్ట్స్.ఇది పూర్తి సెలవు కాదు కాని కాస్త రిలాక్సేషన్ మాత్రం ఇవ్వగలదు.ఈ కాస్త విశ్రాంతి కోసం సౌకర్యంగా ఉన్న ప్రదేశం కోసం కూర్చుని పుస్తకం చదువుకోవడం అన్ని గ్యాడ్జెట్స్ స్విచ్ ఆఫ్ చేసి చక్కని సంగీతం వినడం ఇష్టమైన పానియం చప్పరించడం, గోరు వెచ్చని నీటిలో పాదాలు ఉంచి హాయిగా మైండ్ కి బ్రేక్ ఇస్తూ రిలాక్స్ ఇవ్వడం చేయవచ్చు. నెమ్మదిగా బయటి ప్రపంచానికి డిస్ కనెక్ట్ అవ్వాలి.

Leave a comment