కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్,జగపతి బాబు నటించిన మిస్ ఇండియా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మానస సంయుక్త చిన్నప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్త కావాలని అనుకుంటుంది.పుట్టి పెరిగిన లంఖ సింగి  గ్రామంలో తాతయ్య బాల్యంలో రుచి చూపించిన హెర్బల్ టీ ని వ్యాపారంగా మలుచుకోవాలనుకుంటుంది.అన్న ఉద్యోగం తో అమెరికా వచ్చిన మానస టీ బిజినెస్ స్థాపించి యువ పారిశ్రామిక వేత్తగా ఎదుగుతుంది.అంతర్లీనంగా మహిళా సాధికారతకు పెద్ద పీట వేసారు దర్శకుడు నరేంద్ర నాథ్ కలలు కనడం వాటిని నిజం చేసుకోవడం కోసం కష్టపడటం అన్న కాన్సెప్ట్ చక్కగా ఉంది ఈ ప్రపంచంలో ఎక్కడైనా మన ఇండియన్ చాయ్ కి తిరుగు లేదని నిరూపించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ వంద మార్కులు సంపాదించింది.

రవిచంద్ర. సి
7093440630

Leave a comment