మిస్ యూనివర్స్ కిరీటం అందుకున్నది మెక్సికోకు చెందిన ఆండ్రియా మోజీ. 26 సంవత్సరాల ఆండ్రియా ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఉద్యోగం చేస్తూ మాడలింగ్ లోనూ తన ప్రతిభను చూపెడుతోంది 73 దేశాలకు చెందిన  సుందరీమణులు పాల్గొన్న 69 వ విశ్వసుందరి పోటీల్లో మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకున్న ఆండ్రియా మోజీ మెక్సికో హక్కుల అంబాసిడర్ గా పని చేస్తోంది. మన ఆలోచన విధానం  వ్యవహార శైలి లోనే మన అందం ఉంటుంది అంటోంది విశ్వసుందరి.

Leave a comment