మీరు మీకే ప్రత్యేకం అని నమ్మండి ఇతరులతో పోల్చుకోవడం ఆపేసి మీ గురించి మీరే మాట్లాడండి, మీ జీవితానికి మీరే లీడర్. నన్ను నేను నమ్మాను అందుకే ఈరోజు ఈ వేదిక మీద నిల్చో గలిగాను అంటుంది విశ్వసుందరి హర్నాజ్ సంధు.ఇజ్రాయిల్‌లోని ఇలాట్  నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 21 సంవత్సరాల తర్వాత సుస్మితాసేన్,లారాదత్తా తర్వాత మిస్ యూనివర్స్ గా నిలిచిన మూడో భారతీయ యువతి 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించి పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది హర్నాజ్ సంధు. చండీగఢ్ లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో పుట్టిన హర్నాజ్ ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేస్తోంది.

Leave a comment