Categories
వేసవి సెలవుల్లో తప్పని సరిగా ప్రయాణాలు ప్లాన్ చేసుకొంటారు .ఎక్కువ దుస్తులు తీసుకువెళ్ళటం బరువు, కానీ ఫ్యాషన్ గా ఉండాలని ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్స్ ఏ మంటారంటే మాచింగ్ కోసం చూడటం మానేసి మిక్స అండ్ మ్యాచ్ వేసుకోండి అని. ఒక దానికొకటి భిన్నం ఉండాలి. చక్కని రంగుల్లో ఉండాలి. అన్నింటి మీదకు ఓ మల్టీకలర్ నెక్లిస్ సన్నటి చెయిన్ ,ఇయర్ రింగ్స్ సరిపొతాయి. ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక నూలు ,ఖాదీతో చేసిన దుస్తులు ఎంచుకోవాలి. అలాగే వెళ్లబోయే ప్రదేశాల్ని బట్టి కూడా దుస్తులు ఎంపిక చేసుకోవాలి. టీ-షర్టులు, జీన్స్ దాదాపుగా ఏ ప్రదేశంలో నైనా సులువుగా సుఖంగా వేసుకొనేందుకు వీలుగా ఉంటాయి.