ముంబయ్ లో మొబైల్ టాయ్ లెట్స్ రోడ్డెక్కాయి . ఇదొక పాత బస్ . దీన్ని కాస్తే  టాయ్ లెట్ గా మార్చారు . ఇందులో మహిళలకు మరుగు దొడ్డితో పాటు కాస్సేపు విశ్రాంతి గడిపేందుకు టి.వి , వైఫై  సదుపాయాలు ఉన్నాయి . బస్ లోనే శానిటరీ నాప్ కిన్  డిస్పోజల్ మెషీన్ ఉంది వెస్ట్రన్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేశారు . నిర్వహణ కోసం ఒక మహిళా కూడా ఉంటుంది . ఐదు రూపాయిల చెల్లించి మహిళలు ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు . బస్ బయట భాగంలో వాణిజ్య ప్రకటనలు ఏర్పాటు చేయటం ఫ్యాకేజ్డ్ ఉత్పత్తులు మహిళల ఆరోగ్యానికి సంబందించిన ఉత్పత్తులు కూడా అమ్ము కొనేందుకు నిర్వాహకులకు అనుమతి ఇచ్చారు . ప్రస్తుతం ఈ మొబైల్ టాయ్ లెట్ మెరైన్ డ్రైవ్స్ సర్వీస్ రోడ్ లో ఉంది .

Leave a comment