ఆసియాలో మొట్టమొదటి మహిళ న్యూరో సర్జన్ తంజావూరు శాంత కృష్ణ కనక. టిఎస్ కనక సర్జరీ రంగంలో నిష్ణాతురాలు .నవంబర్ 14వ తేదిన కన్నుమూసింది టిఎస్ కనక.సర్జరీ రంగంలో పురుషాధిక్యతను ఎదుర్కొని వివక్షకు గురై అన్నింనిటీని తట్టుకొని లక్ష్యాన్ని చేధించింది. వృత్తికే పూర్తిగా అంకితం కావాలని పెళ్ళిని వద్దనుకొన్నదామె.న్యూరో సర్జరీలో అనేక పరిశోధనలు ,ప్రతిపాదరనలు బ్రెయిన్ స్టిమ్యూలేషన్ పై ఆమె పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా మన్నలు అందుకున్నాయి.1996లో ఏషియన్ ఉమెన్స్ న్యూరో సర్జికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా నియమితులయ్యారు.

Leave a comment